నాణ్యత లోపిస్తే చర్యలే
జోగిపేట(అందోల్): అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. అందోల్‌లోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో మంత్రి దామోదర ఆదివారం తనిఖీ చేశారు. బాలికల పాలిటెక్నిక్, నర్సింగ్ కళాశాల, కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ....పనుల నాణ్యత లో రాజీ పడొద్దని అధికారులకు, కాంట్రాక్టర్‌లకు సూచించారు. వీలైనంత త్వరగా పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. అందోల్‌లోని విద్యాసంస్థలన్నిటికీ లైటింగ్ పనులు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు.
పర్యాటక కేంద్రంగా సింగూరు...
సింగూరును రూ.100కోట్ల వ్యయంతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి దామోదర పేర్కొన్నారు. సింగూరు ప్రాజెక్టు వద్ద నీటిపారుదల శాఖ స్థలంలో టూరిజం అభివృద్ధితోపాటు ప్రాజెక్టు నీటి మధ్యన పడకంటిగడ్డపై పార్కులు, ముద్దాయిపేట సమీపంలో, ిపాత సింగూరు పునరావాస స్థలంలో పార్కులు నిర్మిస్తామని తెలిపారు. పుల్‌కల్ నుంచి సింగూరు ప్రాజెక్టుకు వన్‌వే రహదారి నిర్మించి విభాగినులు ఏర్పాటుచేస్తామన్నారు. కస్తూర్బా పాఠశాలలో రూ.1.40కోట్లతో డిజిటలైజేషన్ చేస్తామని ఈ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. మంత్రి వెంట అందోల్ ఆర్డీవో పాండు, ఏఈ మల్లప్ప, పాఠశాలల ప్రిన్సిపాల్‌లు, ఉపాధ్యాయులు ఉన్నారు.
క్రికెట్ ముగింపు కార్యక్రమానికి ఆహ్వానం
ఈనెల 26న మాజీమంత్రి దివంగత సిలారపు రాజనర్సింహ మెమోరియల్ క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరుకావాలని మంత్రి దామోదర రాజనర్సింహను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ నెల 18వ తేదీ నుంచి మంత్రి తండ్రి రాజనర్సింహ పేర క్రికెట్ పోటీలు స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
మంత్రి దామోదర రాజనర్సింహ
అందోల్ విద్యాసంస్థల్లో
కొనసాగుతున్న పనుల తనిఖీ
రూ.100 కోట్లతో
సింగూరు టూరిజం పనులు
Comments
Please login to add a commentAdd a comment