ఎన్‌హెచ్‌గా గుర్తింపునకు ప్రతిపాదనలు
నారాయణఖేడ్: ఖేడ్ నియోజకవర్గంలోని రెండు ప్రధాన రహదారులను రెండు రాష్ట్రాలకు అనుసంధానిస్తూ జాతీయ రహదారులుగా గుర్తించేందుకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ద్వారా కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ కరీంనగర్ నుంచి సిద్దిపేట, మెదక్ మీదుగా ఉన్న జాతీయ రహదారిని బొడ్మట్‌పల్లి, అల్లాదుర్గం, మెటల్ కుంటలు మీదుగా జహీరా బాద్ వరకు పొడిగించి జాతీయ రహదారిగా గుర్తించేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. ఈమార్గంలోని ఉసిరికెపల్లి నుంచి ఖేడ్, కంగ్టి, ఔరాద్, లాతూర్‌ల మీదుగా ఉద్గీర్ లోని జాతీయ రహదారివరకు 170 కి. మీలను జాతీయ రహదారిగా గుర్తించి అభివృద్ధి చేయాల్సి ఉందని చెప్పారు. ఖేడ్ మీదుగా 161బీ జాతీయ రహదారి ఉన్నందున ఇక్కడినుంచి కరస్‌గుత్తి, సంత్‌పూర్, సంగం, కమలనగర్ మీదుగా నీలంగా వరకు ఉన్న రహదారిని జాతీయ రహదారిగా గుర్తించి అక్కడి ఎన్‌హెచ్‌కు అనుసంధానించాలన్నారు. ఆయా రహదారులు తెలంగాణ నుంచి కర్ణాటక, మహారాష్ట్రల మీదుగా ఉండటంతో ఆయారాష్ట్రాలకు అనుసంధానమవుతాయన్నా రు. ఈమేరకు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన వెల్లడించారు. ఖేడ్ పట్టణంలోని ప్రధాన రోడ్లను ఇరుపక్కలా 40 అడుగుల వెడల్పుతో విస్తరించనుండగా రోడ్డు బాగాపాడైనందున వారం రోజుల్లోగా మరమ్మతులు చేయిస్తామని తెలిపారు.
వారికీ రైతు భరోసా...
అసైన్డ్ భూముల్లో చాలాచోట్ల రాళ్లురప్పులు ఉండి అందులో కొంతమేర సాగులో లేకున్నా పేదలైనందున వారికి రైతుభరోసా అందించాలని, అంతగా పంటలు పండని పెద్దపట్టేదారులకు కూడా రైతుభరోసా అందించేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందన్నారు. అంతకుముందు ఇటీవల పీహెచ్‌డీ పట్టా పొందిన మనూరు మండలం శెల్గిరాకు చెందిన ఎం. విఠల్‌ను ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఘనంగా సన్మానించారు.
ఖేడ్‌లో రెండు ప్రధాన రహదారులు
మూడు రాష్ట్రాలతో అనుసంధానం
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment