గ్రామ సభలకు ఏర్పాట్లు చేయాలి
కలెక్టర్ వల్లూరు క్రాంతి
సంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుంచి ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఈనెల 21 నుంచి చేపట్టనున్న గ్రామసభలకు అన్ని రకాల ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి వారికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...గ్రామసభల వద్ద ప్రజలకు మంచి నీరు, కుర్చీలు వంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సమర్థవంతంగా గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలలో ముందు జాగ్రత్తలు చేపట్టాలన్నారు.
సాగు భూములకే
రైతు భరోసా
అదనపు కలెక్టర్ మాధురి
కొండాపూర్(సంగారెడ్డి): కేవలం సాగులో ఉన్న భూములకే రైతు భరోసా పఽథకం వర్తిస్తుందని అదనపు కలెక్టర్ మాధురి స్పష్టం చేశారు. రెవెన్యూ, వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సాగులో లేని భూముల వివరాలను సేకరించాలని అధికారులను ఆమె ఆదేశించారు. మండల పరిధిలోని మల్కాపూర్‌లో రైతు భరోసా సర్వే మ్యాప్‌ను అదనపు కలెక్టర్‌తోపాటు ఆర్డీవో రవీందర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ...ప్రభుత్వ ఆదేశాల మేరకు రాళ్లు ఉన్న భూములు, ప్లాట్‌లుగా మారిన భూములు, మందిరాలుగా మారిన, స్థిరాస్తి లేఅవుట్‌లుగా మారిన , రహదారులుగా మారినవి, పరిశ్రమలు, గోదాంలకు, మైనింగ్‌లకు వినియోగిస్తున్న వాటి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ అనిత, వ్యవసాయాధికారి గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
దాడి చేసిన వారిని
కఠినంగా శిక్షించాలి
టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్
నారాయణఖేడ్: తుక్కుగూడ ప్రధానోపాధ్యాయుడు రాములుపై దాడిచేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్ చేసింది. ఆదివారం ఖేడ్‌లోని సంఘం ప్రాంతీయ కార్యాలయంలో ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కంబాపురంఅశోక్, సాయిలు మాట్లాడుతూ...తుక్కు గూడ ఘటనకు నిరసనగా జిల్లాలో అన్ని పాఠశాలల్లో భోజన విరామ సమయంలో సోమవా రం నిరసన ప్రదర్శనలు చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సర్వీస్ పింఛను సాధిస్తాం
టీఎస్‌సీపీఎస్‌ఈయూ
రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ
సంగారెడ్డి జోన్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులకు త్వరలోనే సర్వీస్ పింఛను సాధిస్తామని తెలంగాణ సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని ఆదివారం నిర్వహించిన టీఎస్‌సీపీఎస్‌ఈయూ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఐక్యంగా ఉద్యమించడం వల్లే సీపీఎస్ ఉద్యోగులకు గ్రాడ్యుటీ, ఫ్యామిలీ పింఛను సాధించామన్నారు. సీపీఎస్ రద్దు , ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు సంఘం బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment