‘ఆర్చరీను ప్రోత్సహిస్తే పతకాలు తెస్తాం’
రామచంద్రాపురం(పటాన్‌చెరు): ప్రభుత్వం ఆర్చరీ క్రీడను ప్రోత్సహిస్తే ఒలింపిక్‌లో పథకాలు సాధించి తీరుతామని రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు టి.రాజు ధీమా వ్యక్తం చేశారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ క్రీడా మైదానంలో రాష్ట్రస్థాయి ఇంటర్ డిస్ట్రిక్ జూనియర్ ఆర్చరీ చాంపియన్ షిప్ పోటీలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం ఒలిపింక్ పథకాలు సాధించేందుకు రూపొందించిన 8 ప్రధాన క్రీడల్లో ఆర్చరీను చేర్చడం హర్షదాయకమన్నారు. ఈ పోటీల్లో 20 జిల్లాల నుంచి 188మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఫిబ్రవరిలో పశ్చిమబెంగాల్‌లో జరిగే జాతీయస్థాయి ఆర్చరీ క్రీడా పోటీలో పాల్గొంటారన్నారు. రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ మాట్లాడుతూ... గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందు కు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment