శిల్పారామం... చెత్తమయం
సంగారెడ్డి ప్రజలకు ఆహ్లాదం, సంప్రదాయ కళల పరిరక్షణ కోసం మినీ శిల్పారామాన్ని అందుబాటులోకి తీసుకురావాలని గతంలో మహబూబ్‌సాగర చెరువు ఆవరణలో రూ.కోట్ల వ్యయంతో నిర్మాణాలు ప్రారంభించారు. పదేళ్లకు పైగా గడిచినా శిల్పారామాన్ని మాత్రం అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. లోపల చెత్త వేయటంతో ప్రాంగణమంతా డంపింగ్‌యార్డులా తయారైంది. చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయి పాములకు ఆవాసంగా మారింది. ఇప్పటికై నా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి శిల్పారామాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సంగారెడ్డి వాసులు కోరుతున్నారు.
–సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment