మహిళా ఆర్థికాభివృద్ధికే షాపింగ్ కాంప్లెక్స్
● నేడు ప్రారంభించనున్న మంత్రి దామోదర ● రూ.1.4 కోట్లతో 16 షాపుల నిర్మాణం
సంగారెడ్డి జోన్: మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే అనేక కార్యక్రమాలు చేపట్టింది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డులో పాత డీఆర్‌డీఏ కార్యాలయం ఆవరణలో ప్రభుత్వ స్థలంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దుకాణాల సముదాయాన్ని (షాపింగ్ కాంప్లెక్స్) నిర్మించారు. శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
12 గుంటలు..16 దుకాణాలు
జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పాత డీఆర్‌డీఏ కార్యాలయం ఆవరణలో ఉన్న 12 గుంటల విస్తీర్ణంలో 16 దుకాణాలతో కూడిన షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. రూ. 1.4 కోట్ల నిధులతో దుకాణాల నిర్మాణ పనులు పూర్తి చేశా రు. దుకాణాల ద్వారా వచ్చే ఆదాయాన్ని మొత్తం మహిళా సమాఖ్యలో జమ చేయనున్నారు. దుకాణాల్లో వ్యాపారాలు చేసుకునేందుకు మహిళా సంఘాలలోని సభ్యులు మాత్రమే అర్హులుగా ఉంటారు. అర్హులను లాటరీ ద్వారా గుర్తించి, దుకాణాలను కేటాయించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment