ఆక్రమణలో సర్కారీ భూములు
చోద్యం చూస్తున్న అధికారులు
● ఊట్ల, వావిలాల, జిన్నారం గ్రామాల్లో దర్జాగా అక్రమ నిర్మాణాలు ● ఫిర్యాదులు చేసినా పట్టించుకోని వైనం
జిన్నారం (పటాన్‌చెరు): జిన్నారం మండలంలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నా యి. ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జిన్నారం మండలం ఊట్ల గ్రామపంచాయతీ పరిధిలోని ఎన్‌ఎస్‌ఆర్ గార్డెన్ యాజమాన్యం అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరరోపిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాలను కన్వర్షన్ చేయకుండా ఏకంగా కమర్షియల్ నిర్మాణాలకు తెరలేపారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు నిర్మాణాలు
ఊట్ల గ్రామపంచాయతీ పరిధిలోని 527 సర్వే నంబర్లో నక్షబాట కబ్జాకు గురవుతుందని గ్రామస్తులు కొన్ని నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిపై లిఖితపూర్వకంగా స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు జిల్లా అధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. ఇక వావిలాల గ్రామంలో ప్రైవేట్ వ్యక్తులు తమ వ్యవసాయ పొలాల్లోకి వెళ్లేందుకు ముందున్న ప్రభుత్వ భూమిలో అక్రమంగా 60 ఫీట్ల రోడ్డు మార్గాన్ని చేపడుతున్నారని గ్రామస్తుల ఆరోపించారు. ఇప్పటికై నా అక్రమ నిర్మాణాలను గుర్తించి అధికారులు సరైన విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఊట్ల, వావిలాల, జిన్నారం గ్రామాల్లో జరుగుతున్న అక్రమాలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆయా గ్రామస్తులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment