‘అందోల్’లో నవోదయ పాఠశాల
జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు
జోగిపేట(అందోల్): సంగారెడ్డి జిల్లాకు మంజూరైన నవోదయ పాఠశాలను అందోల్ నియోజకవర్గం పుల్కల్ మండలం బస్వాపూర్‌లో నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులను ప్రారంభించాల్సి ఉండటంతో తాత్కాలికంగా జోగిపేటలోనే నిర్వహించేందుకు ప్రాథమికోన్నత పాఠశాలలోని తరగతి గదులను డీఈవో పరిశీలించారు. బస్వాపూర్ గ్రామ శివారులో సర్వే నంబరు 417లోని 30 ఎకరాల్లో నవోదయ పాఠశాల నిర్మాణ పనులు జరగనున్నాయని తెలిపారు. భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకు జోగిపేటలో నవోదయ పాఠశాల తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. పరిశీలించిన విషయాలను జిల్లా కలెక్టర్‌కు నివేదిక ద్వారా తెలియజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పీఆర్‌టీయూ అధ్యక్షుడు ఆకుల మాణయ్య, సీఏవో వెంకటేశం, ఏఎంవో అనురాధ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment