జాబ్‌మేళాకు అనూహ్య స్పందన
99 మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు
సదాశివపేట(సంగారెడ్డి): ఉద్యోగాల గురించి ఎదురుచూసే వారికి మెగా జాబ్‌మేళాలు వరంలాంటివని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బంగ్లా భారతి పేర్కొన్నారు, సోమవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు 300 మంది నిరుద్యోగ యువతీ యువకులు హజరుకాగా 29 పరిశ్రమల ప్రతినిధులు హజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలు నిర్వహించి 99 మందిని ఎంపిక చేసి.. అక్కడికక్కడే అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరైనా ఉద్యోగాల గురించి ప్రయత్నం చేస్తున్నవారు జాబ్‌మేళాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భవిష్యత్‌లో మరిన్ని జాబ్‌మేళాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ సిద్దులు, డాక్టర్ పి, మురళీకృష్ణ, సర్వయ్య, శకుంతల పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment