సొసైటీలకు నిధులొచ్చేనా? | - | Sakshi
Sakshi News home page

సొసైటీలకు నిధులొచ్చేనా?

Published Mon, Jan 6 2025 7:54 AM | Last Updated on Mon, Jan 6 2025 7:54 AM

సొసైటీలకు నిధులొచ్చేనా?

సొసైటీలకు నిధులొచ్చేనా?

వట్‌పల్లి (అందోల్‌ ): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు అప్పటి ప్రభుత్వాలు బీసీ కులవృత్తుల వారికి ఆర్థికంగా అండగా ఉండేందుకు కార్పొరేషన్‌ ద్వారా బ్యాంక్‌ లింకేజీ రుణాలను సబ్సిడీపై అందజేసేది. ఆయా ఆర్థిక ఏడాదిలో బీసీ కార్పొరేషన్‌ ద్వారా అందజేసే రుణాలతో వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వ్యాపారాలు ఏర్పాటు చేసుకునే వారు. ఒక్కో సొసైటీలో 11 నుంచి 15 మంది సభ్యులు ఉంటారు. వారు చేసే కులవృత్తిని బట్టి వారికి రూ.10 లక్షల నుంచి రూ.30లక్షల వరకు సబ్సిడీపై రుణాలు అందజేసేవారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సైతం ఈ సొసైటీలు కొనసాగాయి. వీటి సంఖ్య సైతం పెరిగినప్పటికీ అంతగా గుర్తింపు లభించలేదు. ప్రభుత్వం ఎలాంటి నిధులు మంజూరు చేయకపోవడంతో సొసైటీలన్నీ కనుమరుగయ్యాయి. నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది ముగిసినా బీసీ కార్పొరేషన్‌ రుణాల విషయంలో ఎటువంటి ప్రకటన రాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికై నా సొసైటీలకు గతంలో మాదిరిగా ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి పునర్వైభవం తీసుకురావాలని బీసీ సంఘాల నేతలు కోరుతున్నారు.

జిల్లాలో 26 మండలాలు ఉండగా, ఇందులో 388 బీసీ సొసైటీలున్నాయి. ఈ సొసైటీలలో సుమారు 5 వేలకుపైగా సభ్యులున్నారు. కులవృత్తులను బట్టి యూనిట్లను వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుంది. వారు చేసుకునే వ్యాపార ఖర్చులకు సంబంధించి కో ఆపరేటివ్‌ సొసైటీ ఆయా ఆర్థిక సంవత్సరంలో ఆడిట్‌ సైతం చేసేది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో ఆ సొసైటీలకు ఎలాంటి నిధులు విడుదల చేయకపోవడంతో ప్రస్తుతం ఆ సొసైటీలు పనిచేయడం లేదు. దీంతో సొసైటీలు న్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.

గుర్తింపు ఇవ్వాలి...

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు బీసీ కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీపై రుణాలు అందజేసేవారు. గత ప్రభుత్వం హయంలో ఆన్‌లైన్‌ ద్వారా సొసైటీల రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని చెప్పింది. దీంతో ఒక్కొక్క సొసైటీ తయారీ కోసం రూ.5వేలు ఖర్చు అయ్యాయి. కానీ నిధులు మంజూరు చేయకపోవడంతో సొసైటీలన్నీ కనుమరుగయ్యాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం సొసైటీలను గుర్తించి నిధులు మంజూరు చేయాలి. కులవృత్తుల వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది.

–కొన వేణు, బీసీ సంఘం జిల్లా నాయకుడు

రుణాలు మంజూరు చేయాలి

దేశ సంపదను సృష్టిస్తున్న బీసీ కులాలు ఆర్థికంగా ఎదగాల్సిన అవసరం ఉంది. దీనికోసం బ్యాంకుల ద్వారా బీసీలకు సబ్సీడీ రుణాలను అందజేయాలి. బ్యాంకుల్లో అప్పులు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయేవారికి రూ.వేల కోట్లు అప్పులిస్తున్నారు కానీ దేశ సంపదను సృష్టించే బీసీ కులాలను నిర్లక్ష్యం చేయడం సరికాదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గతంలో మాదిరిగా బీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి సొసైటీలను గుర్తించి సబ్సీడీ రుణాలను అందజేయాలి.

–బీరయ్య యాదవ్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి

బీసీ సంక్షేమ సంఘం

బీసీ అభివృద్ధిశాఖలో

కార్పొరేషన్‌ విలీనం..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు బీసీలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బీసీ కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీ రుణాలు అందజేసేవారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం బీసీ కార్పొరేషన్‌ను జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు ఆ శాఖను 2017–18 సంవత్సరంలో బీసీ అభివృద్ధి శాఖలో విలీనం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం బీసీలకు అంతగా రుణాలు అందజేయలేదు. 2017–18లో జిల్లాలోని 2009 మందికి రూ.50 వేలతో వందశాతం సబ్సిడీపై రుణాలు అందజేశారు. 2023లో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు రూ.లక్షతో వంద శాతం సబ్సిడీపై 700 మంది మాత్రమే రుణాలు అందజేశారు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఆయా ఆర్థిక సంవత్సరంలో ముందుగా ప్రణాళికలను సిద్ధం చేసి సబ్సిడీపై రుణాలు అందజేసేవారు.

జిల్లాలో 388 సొసైటీలు..

జిల్లాలో 388 బీసీ సొసైటీలు

ప్రత్యేక రాష్ట్రంలో సొసైటీలు కనుమరుగు!

కాంగ్రెస్‌ సర్కారుకు ఏడాది గడిచినా

బీసీ రుణాలపై స్పష్టత కరువు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement