పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
పటాన్‌చెరుటౌన్: కార్మిక,కర్షక,ప్రజాసమస్యలు పరిష్కారం అవ్వాలంటే ఉద్యమాలు, పోరాటాలతోనే సాధ్యమని సీపీఎం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్, సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం పటాన్చెరు పట్టణంలో మహాసభల వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జున్‌తో కలసి 2కే రన్లో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రామచంద్రపురంలోని అంబేడ్కర్ విగ్రహం వరకు జరిగిన 2 కే రన్‌ను చుక్కా రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కార్మిక వర్గ సమస్యలు పోరాటాలతోనే పరిష్కారం అవుతాయే తప్ప పాలకుల దయాదాక్షిణ్యాలపై కాదని ఇప్పటికే అనుభవంలో రుజువైందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలను తిరస్కరించి మన కష్టాలు తీరుస్తారని కాంగ్రెస్‌కు పట్టం కడితే ఎక్కడి గొంగడి అక్కడే అన్న చందంగా కార్మికుల కనీస వేతనాలు పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం పైనే దాడి చేస్తోందని మండిపడ్డారు. ఈ నెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో జరిగే సీపీఎం రాష్ట్ర మహాసభలో తెలంగాణ సమగ్రాభివృద్ధి కార్మిక కర్షక ప్రజా సమస్యలపై చర్చిస్తామన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు
చుక్కా రాములు
Comments
Please login to add a commentAdd a comment