సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రభుత్వ సమాచారాన్ని బ్రెయిలీ లిపిలోనూ ముద్రించాలని, అంధుల హక్కుల సాధనకు మరింతగా ఉద్యమిస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేవల్ కిషన్ భవన్‌లో బ్రెయిలీ 216వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అడివయ్య మాట్లాడుతూ...లూయిస్ బ్రెయిలీ తన వ ఏట ప్రమాదవశాత్తు రెండు కళ్లను కోల్పోయి పూర్తి అంధుడిగా మారారని గుర్తు చేశారు. అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారీకి కృషి చేశారని పేర్కొన్నారు.
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక
Comments
Please login to add a commentAdd a comment