26 నుంచి కొత్త రేషన్ కార్డులు
సంగారెడ్డి జోన్: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీపి కబురు చెప్పారు. శనివారం నిర్వహించిన మంత్రి వర్గ సమావేశం అనంతరం ఈ నెల 26 నుంచి అర్హులైన ప్రతీ ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ గత కొన్నేళ్లుగా నిలిపివేయటంతో వివిధ రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తాజా ప్రకటనతో రేషన్ కార్డులు లేనివారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు రేషన్ కార్డుతో ముడిపెట్టడంతో అర్హులైన వారు కూడా రేషన్ కార్డు లేకపోవడంతో ఆయా పథకాలకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రేషన్ కార్డుల జారీకి ఆఫ్‌లైన్ విధానంలోనే దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కేబినేట్ సమావేశం అనంతరం
సీఎం వెల్లడి
కార్డులు అందించేందుకు కసరత్తు
ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు
స్వీకరించే అవకాశం
జిల్లాలో మొత్తం కార్డులు 3,78,524
ఆహార భద్రత కార్డులు 3,52,300
అంత్యోదయ కార్డులు 26,124
అన్నపూర్ణ కార్డులు 100
Comments
Please login to add a commentAdd a comment