ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో సిద్దిపేట యువతి
సిద్దిపేట ఎడ్యుకేషన్: ఇంటర్నేషనల్ సౌత్ ఏషియన్ పీస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నట్లు సిద్దిపేట జిల్లాకు చెందిన యువతి మూర్తి శ్రీహితారెడ్డి బుధవారం తెలిపారు. ఏపీలోని కర్నూల్ జిల్లా కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నాలుగు రోజుల పాటు జరిగిన ఇంటర్నేషనల్ సౌత్ ఏషియన్ పీస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో రాష్ట్రం నుంచి తనతోపాటు 19 మంది పాల్గొన్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విశిష్టతను తెలుపుతూ ప్రసంగించినట్లు పేర్కొన్నారు. యువతీ యువకులు కలిసి తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలను, కళా నైపుణ్యాలను ప్రదర్శించినందుకు నేషనల్ యూత్ ప్రాజెక్ట్ సౌత్ రీజినల్ కోఆర్డినేటర్ కన్నె యాదవ రాజు చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment