పదోన్నతితో బాధ్యత పెరుగుతుంది
సంగారెడ్డి జోన్: పదోన్నతి పొందటంతో స్థాయితోపాటు బాధ్యత కూడా పెరుగుతుందని, పెరిగిన బాధ్యతను క్రమశిక్షణతో నిర్వహిస్తూ ప్రజల్లో పోలీస్ శాఖ పట్ల ఉన్న నమ్మకాన్ని, గౌరవాన్ని మరింత పెంచే విధంగా చూడాలని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ పేర్కొన్నారు. జిల్లాలోని 24 మంది ఏఎస్సైలు ఎస్సైగా పదోన్నతి కల్పిస్తూ మల్టీ జోన్ ఐజీ2 సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పదోన్నతి పొందిన వారికి ఎస్సై చిహ్నాలను జిల్లా ఎస్పీ అలంకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సర్వీసులో మరిన్ని ఉత్తమ సేవలను అందించి రాష్ట్ర పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎలాంటి విధులనైనా సమర్థవంతంగా నిర్వహించగలమని, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండగలమని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్
Comments
Please login to add a commentAdd a comment