అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. మండల పరిధిలోని ఆరూర్ గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు క్షేత్రస్థాయిలో చేపట్టిన సర్వేను గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాల సర్వే తీరును పరిశీలించారు. అనంతరం ఇంట్లోని సభ్యులతో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన ఆహార భద్రతా కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు నాలుగు పథకాల అమలుకు లబ్ధిదారుల ఎంపికకు సర్వే ప్రారంభమైందన్నారు. ఈనెల 20 వరకు సర్వే జరుగుతుందని, 21 నుంచి 24 వరకు గ్రామసభలు నిర్వహించి అర్హుల జాబితాను సిద్ధం చేస్తామని తెలిపారు. ఆమె వెంట ఆర్డీవో రవీందర్ రెడ్డి, తహసీల్దార్ సరస్వతి,ఎంపీడీవో లక్ష్మి తదితరులున్నారు.
టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు
సంగారెడ్డి జోన్: సర్వేకు సంబంధించిన సర్వే ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణకు ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ 08455–272233ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ క్రాంతి వెల్లడించారు. ప్రజలకు సులభంగా సేవలు అందించడానికి ఈ నంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు.
కలెక్టర్ వల్లూరు క్రాంతి
Comments
Please login to add a commentAdd a comment