కుంభమేళాలో రంగంపేట వాసి
కొల్చారం(నర్సాపూర్): ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాధువులు, మఠాల పీఠాధిపతులు పాల్గొన్న రథయాత్రలో మండలంలోని రంగంపేట గ్రామానికి చెందిన చిట్కుల కృష్ణస్వామి పాల్గొని సేవలందిస్తున్నారు. తిరుమల తిరుపతి హాథీరాంజీ మఠం పీఠాధిపతి అర్జున్ దాస్ మహంతి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పీఠాధిపతుల రథయాత్రలో ఆయన పాల్గొన్నారు. తమ మఠం ఆధ్వర్యంలో కుంభమేళాలోని భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కృష్ణస్వామి తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళకు ఎంతో విశిష్ట ఉందని, ఇలా సేవచేసే భాగ్యం లభించడం పట్ల తన జీవితం ధన్యమైందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment