తప్పుల్లేకుండా వివరాలు సేకరించాలి
సంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ప్రభుత్వ పథకాల సర్వే ప్రక్రియలో ఎలాంటి తప్పులు లేకుండా వివరాలు సేకరించాలని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేకాధికారి హరిచందన సూచించారు. పట్టణంలోని బృందావన్ కాలనీలోఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి నిర్వహించిన సర్వే ప్రక్రియను గురువారం కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి తనిఖీ చేశారు. సర్వే ప్రక్రియను అధికారులతో పాటు ప్రజలకు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి పరిశీలనను పకడ్బందీగా చేపట్టాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక గ్రామసభలు వార్డు సభలలో చర్చించి అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి జరిగేలా చూడాలని ఆదేశించారు. సేకరించిన తప్పులు లేకుండా క్రమపద్ధతిలో రిజిస్టర్లలో నమోదు చేసుకోవాలని సూచించారు. డేటా ఎంట్రీ సమయంలో పొరపాట్లకు తావులేకుండా చూడాలన్నారు. ఈ నెల 20 నాటికి అన్ని గ్రామాలలో సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్‌రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేకాధికారి
హరిచందన
Comments
Please login to add a commentAdd a comment