రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి
చీకట్లో కనిపించక వ్యక్తిని ఢీకొట్టిన బైక్
హుస్నాబాద్‌రూరల్: రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. ఎస్సై మహేశ్ కథనం మేరకు.. అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన సంపత్(45) వృత్తి రీత్యా లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సంక్రాంతి పండుగ రోజు మంగళవారం రాత్రి హుస్నాబాద్ నుంచి చౌటపల్లికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో మరో వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. బైక్ లైట్ ఫోకస్‌కు ఆ వ్యక్తి కనబడకపోవడంతో సంపత్ అతడిని ఢీకొట్టి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా స్థానికులు 108 అంబులెన్స్‌లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య తిరుమల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment