వివాహిత అదృశ్యం
దుబ్బాకటౌన్: మహిళ అదృశ్యమైన ఘటన రాయపోల్ మండలంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గొల్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉదయ్‌పూర్ గ్రామానికి చెందిన సొక్కం సుజాత–చంద్రం దంపతులు బతుకుదెరువు కోసం పదేళ్ల కిందట మేడ్చల్ వలస వెళ్లారు. ఇటీవలె సొంత ఊరు ఉదయ్‌పూర్‌కి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. 9 తేదీన సొక్కం సుజాత ఇంటి నుంచి వెళ్లి కనిపించడం లేదు. బంధువుల వద్ద, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. సుజాత భర్త చంద్రం బుధవారం రాయపోల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ దేవయ్య తెలిపారు.
దొంగతనం కేసులో
ఐదుగురు అరెస్ట్
చిన్నశంకరంపేట(మెదక్): దొంగతనం కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన చిన్నశంకరంపేట మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. పేట ఎస్‌ఐ నారాయణగౌడ్ కథనం మేరకు.. మండల కేంద్రంలో హర్షిక స్టీల్ కంపెనీ నిర్మాణం కోసం కొన్ని యంత్రాలను తీసుకొచ్చి తమ ప్రహరీ లోపల పెట్టుకుంది. ఇది గమనించి చిన్నశంకరంపేటకు చెందిన రమేశ్, రామచంద్రం, సురేశ్, నాగరాజు, బాబు ఇనుప సామగ్రిని తరలించి సొమ్ము చేసుకోవాలని చూశారు. 10న రాత్రి ఇనుప గేర్ రాడ్‌ను దొంగలించి స్థానికంగా పొలం వద్ద దాచారు. బుధవారం రోజు ఇనుప సామగ్రిని అమ్ముకునేందుకు తీసుకెళ్తున్న క్రమంలో పోలీస్‌లకు పట్టుబడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
విద్యుదాఘాతంతో
పాడి గేదె మృతి
కొండపాక(గజ్వేల్): విద్యుదాఘాతంతో పాడిగేదె మృతి చెందిన ఘటన మండలంలోని సిర్సనగండ్లలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన రైతు దేవిరెడ్డి రాంరెడ్డి రోజూమాదిరి మంగళవారం రాత్రి వ్యవయసాయ బావి వద్ద ఉన్న షెడ్డులో గేదెను కట్టేసి ఇంటికెళ్లాడు. గురువారం ఉదయం వెళ్లేసరికి షెడ్డు సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్‌ఫార్మర్ వద్ద గేదె మృతి చెంది కనిపించింది. వెంటనే విద్యుత్ అధికారులు, గ్రామస్తులకు సమాచారం అందించాడు. గేదె విలువ రూ.70 వేల వరకు ఉంటుందని, ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరాడు.
గడ్డి గోదాంలో
అగ్ని ప్రమాదం
సంగారెడ్డి క్త్రెమ్: గడ్డి గోదాంలో అగ్ని ప్రమాదం జరిగిన ఘటన సంగారెడ్డి పట్టణంలోని వృక్షకాలనీలో బుధవారం చోటు చేసుకుంది. సంగారెడ్డి పట్టణ ఫైర్ ఎస్‌ఐ కిరణ్ రెడ్డి కథనం మేరకు.. మహ్మమద్ సాబెర్ ఖురేషి వృత్తి రీత్యా మటన్ షాపు నడుపుతున్నాడు. ఇంటి ఎదుటు ఖాళీ స్థలంలో చిన్న గోదాంలో గడ్డిని నిల్వ ఉంచాడు. బుధవారం ఒక్కసారిగా గడ్డివాములో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వచ్చి మంటలార్పివేశారు. అప్పటికే సుమారు 1,000 కట్టల గడ్డి దగ్ధం అయ్యింది. రూ.లక్ష వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment