సాగా.. సాగేతరా?
సంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా కార్యక్రమానికి కసరత్తు ప్రారంభించింది. రైతు భరోసా ద్వారా రైతులకు పెట్టుబడి సహాయం అందించనుంది. రైతులు సాగు చేస్తున్న వ్యవసాయ భూములను మాత్రమే భరోసా అందించేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టింది. ఎకరానికి రూ.12వేల ఆర్థిక సహాయాన్ని అందించనున్న ట్లు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 26 నుంచి పథకాన్ని అమలు చేయ నున్నారు. ప్రభుత్వం అందించే సాయం సాగు చేసే రైతులకు మాత్రమే అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
సాగులో సుమారు 7.20 లక్షల ఎకరాలు
జిల్లాలో మొత్తం 8.20లక్షల ఎకరాలకుపైగా భూమి ఉండగా అందులో సుమారు 7.20లక్షల ఎకరాల భూమి సాగులో ఉన్నట్లు అధికారులు వెల్లడించా రు. జిల్లాలో 3.60లక్షల మంది రైతులు ప్రభుత్వం అందించే పెట్టుబడి సహాయం పొందుతున్నారు. పంటలు సాగు చేస్తున్న రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులోభాగంగానే సాగులో లేని భూములను గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
సర్వేలో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు
వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు కలసి సర్వే చేపట్టారు. జిల్లాలో సర్వే ప్రక్రియను గురువారం ప్రారంభించారు. విలేజ్ మ్యాప్, గూగుల్ మ్యాప్ ఆధారంగా క్షేత్రస్థాయిలో సందర్శించి, వ్య వసాయ యోగ్యం కాని భూముల జాబితాను సిద్ధం చేస్తున్నారు. సంబంధిత మండలానికి మండల తహసీల్దార్, మండల వ్యవసాయ శాఖ అధికారులు బాధ్యులుగా వ్యవహరిస్తారు. ప్రతి రెవెన్యూ గ్రా మానికి ఆ శాఖలోని సీనియర్ అసిస్టెంట్, జూనియ ర్ అసిస్టెంట్ అధికారులు, వ్యవసాయ శాఖ నుంచి ఏఈవో బృందంగా ఏర్పడి సర్వే చేయనున్నారు.
21 నుంచి గ్రామ సభలు
భూభారతి(ధరణి) పోర్టల్‌లో వ్యవసాయ భూము లుగా నమోదైన కాలనీలు, లేఅవుట్‌లు, రోడ్లుగా మారిన భూములు, పరిశ్రమలు, గోదాములు, మైనింగ్ కొరకు వినియోగిస్తున్న భూములు, ప్రభు త్వం సేకరించిన భూములు, రాళ్లు, రప్పలు, గుట్టలతో నిండి ఉన్న భూములను సాగుకు అనువుగా లేని భూములుగా సర్వేలో పరిగణిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో ఈ నెల 20 వరకు సర్వేను పూర్తి చేసి, జాబితాను సిద్ధం చేయనున్నారు. 21 నుంచి 24 వరకు గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి జాబితాను ప్రదర్శించనున్నారు. గ్రామ సభలలో ఆమోదించి, గ్రామాల వారీగా సాగుకు యోగ్యం కాని భూముల జాబితాను సంబంధిత వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు.
సర్వే ప్రారంభం
క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న వ్యవసాయ, రెవెన్యూ అధికారులు
20 నాటికి పూర్తి
సర్వే ప్రక్రియ కొనసాగుతోంది
రైతు భరోసా పథకానికి జిల్లాలో సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో సాగుకు యోగ్యం కాని భూములను గుర్తిస్తాం. ఈ నెల 20 వరకు సర్వే ప్రక్రియను పూర్తి చేసి, 21 నుండి 24వరకు గ్రామ సభలను నిర్వహిస్తాం.
– శివప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి,
సంగారెడ్డి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment