ఐఐటీహెచ్‌లో యోగా శిబిరం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రాణాయామం ద్వారా శరీరంలోని సాఫ్ట్‌వేర్‌ను రోగ రహితంగా, శక్తివంతంగా తయారు చేసుకోవడం సాధ్యమవుతుందని స్వామి రాందేవ్‌బాబా శిష్యుడు, యోగా గురువు పరమార్థదేవ్ అన్నారు. హైదరాబాద్ ఐఐటీలో శుక్రవారం ఒక రోజు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఐఐటీహెచ్ విద్యార్థుల్లో ఒత్తిడికి తగ్గించేందుకు ఈ యోగా శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పరమార్థదేవ్ మాట్లాడుతూ.. ధ్యానం ద్వారా మనుసును, బుద్ధిని శుద్ధి చేసుకోవచ్చన్నారు. యోగాతో విద్యార్థులు ఏకాగ్రతను పెంచుకోవచ్చని నిరూపితమైందన్నారు. అనంతరం పరమార్థదేవ్‌ను ఐఐటీహెచ్ ప్రొఫెసర్లు సత్కరించారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతప్రభాకర్, ఐఐటీహెచ్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ ప్రేమ్‌పాల్, హిమాన్ష్ జోషి, ప్రొఫెసర్ నిరంజన్, ఐఐటీహెచ్ విద్యార్థులు పాల్గొన్నారు.
పాల్గొన్న యోగా గురువు పరమార్థదేవ్
Comments
Please login to add a commentAdd a comment