అధికారులకు కలెక్టర్ క్రాంతి ఆదేశం
సంగారెడ్డి జోన్: చెరువులు, కుంటలు, నీటి వనరులను పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆక్రమణలకు గురి కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో తెల్లాపూర్ ప్రాంతంలోని మూడు ప్రధాన చెరువుల అభివృద్ధి, పరిరక్షణ, నీటి నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరిచే అంశాలతో పాటు చెరువుల ప్రస్తుత స్థితిగతులను అధ్యయనం చేసి, వాటి పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చెరువులకు అనుబంధంగా ఉన్న ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్), బఫర్ జోన్ పరిఽధిలను గుర్తించి ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. తెల్లాపూర్ ప్రాంతం హెచ్‌ఎండీఏ పరిధిలోని భవనాల అనుమతులను చా లా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, నీటిపారుదల శాఖలు కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో నీటి పారుదలశాఖ ఈఈ, ఆర్డీఓ పాల్గొన్నారు.
హాస్టల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్ మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను శుక్రవారం ఆమె ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాలు అందించాలని ఆదేశించారు. పదో తరగతి తరగతుల విద్యార్థుల ప్రిపరేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దేవదాస్, ఆర్‌సిఓ గౌతంకుమార్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment