ఎంపీటీసీలు 276.. జెడ్పీటీసీలు 27
●ముసాయిదా జాబితా ప్రకటించిన అధికారులు ●3న తుది జాబితా ప్రకటన
సంగారెడ్డి జోన్: జిల్లాలో ఎంపీటీసీల సంఖ్య తగ్గి జెడ్పీటీసీలు, ఎంపీపీల స్థానాలు పెరగనున్నాయి. పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడంతో పాటు కొత్త మండలాల ఏర్పాటుతో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు జిల్లా పరిషత్ అధికారులు ఆయా మండలాల వారీగా ముసాయిదా జాబితాను విడుదల చేశారు.
తగ్గిన ఎంపీటీసీలు..
పెరిగిన జెడ్పీటీసీ, ఎంపీపీలు
జిల్లాలో 2019 ఎన్నికల సమయంలో 295 ఎంపీటీసీ స్థానాలుండగా, 25 ఎంపీపీలు, జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. గతంలో ఉన్న ఎంపీటీసీ స్థానాలలో నుంచి ప్రస్తుతం 21 తగ్గాయి. కొత్తగా 2 స్థానాలు ఏర్పడ్డాయి. దీంతో ఎంపీటీసీ స్థానాలు 276కు చేరాయి. కొత్తగా ఏర్పడిన రెండు మండలాలతో కలిపి 27గా ఎంపీపీలు, జెడ్పీటీసీలుగా ముసాయిదా జాబితాను ప్రకటించారు. ఫిబ్రవరి 2 వరకు అభ్యంతరాలు స్వీకరించి, 3వ తేదీన తుది జాబితాను ప్రకటించనున్నారు.
మున్సిపాలిటీల విలీనంతో..
జిల్లాలో కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పడంతో పాటు పలు పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. దీంతో ఎంపీటీసీల సంఖ్య తగ్గింది. గుమ్మడిదల మండల ప్రజాపరిషత్ నుంచి 5 ఎంపీటీసీ స్థానాలు, జిన్నారం నుంచి 3, కంగ్గి నుంచి 1, కోహిర్ నుంచి 3, పటాన్‌చెరు నుంచి 9 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. అదేవిధంగా అమీన్‌పూర్‌లో 2 ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. జిల్లాలో అత్యధికంగా పటాన్‌చెరు మండల పరిషత్ నుంచి 9 స్థానాలు తగ్గాయి. కొత్తగా ఏర్పాటైన చౌటకూర్ మండలంలోకి పుల్‌కల్ మండలం నుంచి 6 ఎంపీటీసీ స్థానాలు, అదేవిధంగా నారాయణఖేడ్ నుంచి 3, కల్హేర్ మండలం నుంచి 3 స్థానాలు కలిపి మొత్తం 6 ఎంపీటీసీ స్థానాలను నిజాంపేట మండలంలో కలిపారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో ఎంపీటీసీల సంఖ్య 276కు చేరింది.
కొత్తగా రెండు మండలాల ఏర్పాటు
జిల్లాలో గతంలో 25 మండలాలు ఉండగా, నూతనంగా ఏర్పడిన అందోల్ నియోజకవర్గంలోకి చౌటకూర్, నారాయణఖేడ్‌లో నిజాంపేటలోని పలు పంచాయతీలను విలీనం చేస్తూ నూతన పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. దీంతో జెడ్పీటీసీలు, ఎంపీపీల సంఖ్య 27కు చేరంది. పూర్వ మండలాల్లోని ఎంపీటీసీలు, నూతనంగా ఏర్పడిన మండలాల్లోని జనాభా ఆధారంగా ఏర్పడిన ఎంపీటీసీ, జెడ్పిటీసీ స్థానాలలో ప్రకటించిన తుది జాబితా ఆధారంగానే ఎన్నికలను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment