నెల రోజులపాటు పోలీసు యాక్ట్
ఎస్పీ చెన్నూరి రూపేష్
సంగారెడ్డి జోన్: జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిది జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా, ప్రజాధనానికి నష్టం కల్గించే, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదని చెప్పారు. అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
డీవైఎఫ్‌ఐ పనితీరు భేష్
జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి గోవింద్‌రాం
సంగారెడ్డి రూరల్: డీవైఎఫ్‌ఐ యువతను, విద్యార్థులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతుందని జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి గోవిందరావు అన్నారు. డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్‌ను డీఐఓ గోవిందరావు, జిల్లా యువజన సర్వీసు అండ్ క్రీడల అధికారి నసీరుద్దీన్ చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఐఓ మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థులను సరైన మార్గంలో పయనించే విధంగా డీవైఎఫ్‌ఐ ఎంతో కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శు అనిల్, శివ, సాయి, దత్తు తదితరులు పాల్గొన్నారు.
డ్రిప్ యూనిట్ల పరిశీలన
జహీరాబాద్ టౌన్: సబ్సిడీపై రైతులకు మంజూ రు చేసిన డ్రిప్ యూనిట్లను ఉద్యానశాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) సోమేశ్వర్‌రావు పరిశీలించారు. జహీరాబాద్ మండలం రంజోల్, హుగ్గెల్లి, బాబానగర్‌లో రైతుల పొలాల్లో డ్రిప్ పరికరాలను చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ డ్రిప్ ఇరిగేషన్ పంటల సాగు వల్ల నీరు, విద్యుత్, ఎరువుల వృథాను అరికట్టవచ్చని, కలుపు మొక్కలు, తెగుళ్ల సమస్య చాలా వరకు తగ్గుతుందని చెప్పారు. చెరకు, అల్లం, పసుపు, ఆలు, పండ్ల తోటలకు డ్రిప్ యూనిట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఐదెకరాల ఎకరాల లోపు ఉన్న భూమికి 90 శాతం సబ్సిడీపై యూని ట్లు ఇస్తున్నామన్నారు. ఈ సంవత్స రం జిల్లాలో 2,200 హెక్టార్లలో బిందు, 200 హెక్టార్లలో తుంపర సేద్యాన్ని విస్తరించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట పీడీ వెంట హర్టికల్చర్ అధికారి పండరి, డ్రిప్ కంపెనీల ప్రతినిధులు పాండురాథోడ్, విజయ్,రాములు, మోహన్‌లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment