భువనగిరి ఖిల్లా కిరణ్‌దే.. | Sakshi
Sakshi News home page

భువనగిరి ఖిల్లా కిరణ్‌దే..

Published Tue, May 7 2024 6:50 PM

భువనగ

జెడ్పీటీసీ సభ్యుడు గిరి కొండల్‌రెడ్డి

మద్దూరు(హుస్నాబాద్‌): భువనగిరి ఖిలాపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేద్దామని జెడ్పీటీసీ సభ్యుడు గిరి కొండల్‌రెడ్డి అన్నారు. సోమవా రం దూల్మిట్ట మండల పరిధిలోని జాలపల్లి లో లోక్‌సభ భువనగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి చామ ల కిరణ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి ఓటేసి గెలిపిద్దామన్నారు. ఈ కార్య క్రమంలో కాంగ్రెస్‌ జనగామ నియోజకవర్గ ఇంచార్జి భవానిరెడ్డి, నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు చెట్కూరి కమలాకర్‌ యాదవ్‌, మండల అధ్యక్షుడు సాయిలు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీలోకి యువత చేరిక

బెజ్జంకి(సిద్దిపేట): యూదవ, రెడ్డి కులసంఘాల యువత కాషాయ కండువా కప్పుకొన్నారు. సోమవవారం వారు కరీంనగర్‌ ఎంపీ బండియ్‌ సంజయ్‌ కార్యాలయంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన దేవక్కపల్లి వాసులకు ఆయన కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి మహిపాల్‌రెడ్డి, అజయ్‌వర్మ, బాల్‌రెడ్డి, కమాకర్‌రెడ్డి, కిష్టారెడ్డి, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్‌పై కాంగ్రెస్‌ జెండా

బ్లాక్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌

బెజ్జంకి(సిద్దిపేట): లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయడం ఖాయమని బ్లాక్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు లింగాల శ్రీనివాస్‌ అన్నారు. సోమ వారం ఆయన బెజ్జంకిలోని 9, 10 వార్డుల్లో కాంగ్రెస్‌ పార్టీ కరీంనగర్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుకు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తోనే పేదల అభివృద్ధి సాధ్యమన్నారు. ఈకార్యక్రమంలో పార్టీ మండ ల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పోచయ్య, మాజీ స ర్పంచ్‌ నర్సయ్య, ప్రధాన కార్యదర్శి మల్లేశం, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్‌, రమేశ్‌ పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ వల్లే నిరుద్యోగ సమస్య

కాంగ్రెస్‌ పార్టీతోనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని కవ్వంపల్లి యువసేన అధ్యక్షుడు కత్తి రమేశ్‌ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ యువతను నిర్లక్ష్యం చేయ డం వల్లే నిరుద్యోగ సమస్య తీవ్రమయిందన్నారు. యువత మొత్తం వెలిచాల రాజేందర్‌రావుకు మద్దతుగా నిలుస్తుదన్నారు.

క్యామకు మద్దతుగా ప్రచారం

చేర్యాల(సిద్దిపేట): పట్టణపరిధిలోని 4వ వార్డులో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నిమ్మరాజీవ్‌ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ భువనగిరి పార్లమెంట్‌ అభ్యర్థి క్యామ మల్లేశం గెలుపుకోసం ఇంటింటి ప్రచారం చేశారు. పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈకార్యక్రమంలో వార్డు కమిటీ సభ్యులు మహ్మద్‌ గౌస్‌, గణేశ్‌, హరీశ్‌, నవీన్‌, మల్లయ్య, ప్రభాకర్‌, చింటూ పాల్గొన్నారు.

బెల్ట్‌ షాపులపై దాడులు

అక్కన్నపేట(హుస్నాబాద్‌): టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు బెల్ట్‌షాపులపై దాడి చేసిన అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని సీజ్‌ చేశారు. గౌరవెల్లికి చెందిన చీకట్ల రాజయ్య దుకాణంలో 11బీర్లు, మల్లంపల్లి గ్రామంలోని 12 లీటర్ల మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈతారాంపల్లిలో 28 లీటర్ల మద్యం

వర్గల్‌(గజ్వేల్‌): మండల పరిధిలోని సీతారాంపల్లిలో పంజాల ప్రభాకర్‌ తన కిరణాషాపులో అక్రమంగా మద్యం విక్రియిస్తున్నాడు. గౌరా రం పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ సంయుక్త దాడి చేసి 28లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేశారు.

హోటల్‌లో మద్యం సీజ్‌

సిద్దిపేటకమాన్‌: ఓ హోటల్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సంఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. సిద్దిపేట టూటౌన్‌ సీఐ ఉపేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రేణుక నగర్‌లో రాజు తన హోటల్‌లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు టూటౌన్‌ పోలీసులు సోమవారం తనిఖీ లు చేపట్టి 5.5 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

భువనగిరి ఖిల్లా కిరణ్‌దే..
1/2

భువనగిరి ఖిల్లా కిరణ్‌దే..

భువనగిరి ఖిల్లా కిరణ్‌దే..
2/2

భువనగిరి ఖిల్లా కిరణ్‌దే..

Advertisement

తప్పక చదవండి

Advertisement