రైతులు ఆగం కావొద్దు
సిద్దిపేటకమాన్: ప్రతిపక్షాల మాట విని రైతులు ఆగం కావొద్దని, అందరికీ రుణమాఫీ అవుతుందని, కాంగ్రెస్ పాలనలోనే రైతులకు మేలు జరుగుతుందని డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజు అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ నాయకులే రైతుల పేరుతో ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గత పదేళ్లలో రైతులను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. 2014 లో బీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో రూ.లక్ష రుణమాఫీ అని చెప్పి పదేళ్లు కాలయాపన చేసి కనీసం వడ్డీ కూడా మాఫీ చేయలేదన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు ఎన్ని డ్రామాలాడిన నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. ఇది రైతుల ప్రభుత్వమని, రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కొన్ని సాంకేతికంగా సమస్యల వల్ల కొందరికి రుణమాఫీ ఆలస్యం అవుతందన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే రైతులు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని కోరారు. సమావేశంలో మహేందర్, రాజేష్, సంపత్, భూపతి రెడ్డి, సురేందర్, కనకయ్య, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ రుణమాఫీ అవుతుంది
బీఆర్‌ఎస్ నేతలవి డ్రామాలే..
డీసీసీ ప్రధాన కార్యదర్శి నాగరాజు
Comments
Please login to add a commentAdd a comment