కార్పొరేట్‌కు దీటుగా సర్కార్ విద్య
● విద్యారంగంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి ● డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ● కాస్మోటిక్ చార్జీల పెంపుపై హర్షం ● సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
గజ్వేల్: కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్యారంగాన్ని తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి తెలిపారు. కాస్మోటిక్ ఛార్జీల పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్‌లోని బాలికల హాస్టల్‌లో విద్యార్థినులతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ విద్యారంగాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. కాస్మోటిక్ చార్జీలు అంతంతమాత్రంగానే ఉండటంతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడ్డారన్నారు. కాస్మోటిక్ చార్జిల పెంపు నిర్ణయంతో లక్షలాదిమంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిందన్నారు. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను జీర్ణించుకోలేక ప్రతిపక్ష నేతలు తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్‌ఖాన్, ఎంఈఓ కృష్ణ, బాలికల వసతి గృహల వార్డెన్‌లు లక్ష్మి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment