రైతుల గోస పట్టని సర్కార్
● ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి ● మాజీ మంత్రి హరీశ్‌రావు
నంగునూరు(సిద్దిపేట): ఓట్లప్పుడు ఊరూరా తిరిగి రైతుల మద్దతు కోరిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్లి మద్దతు ధర వస్తుందా లేదా అని ఎందుకు అడగట్లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. ఆదివారం నంగునూరు మండలం బద్దిపడగలో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను హరీశ్‌రావు దృష్టికి తెచ్చారు. నెల రోజుల కింద వడ్లు తెచ్చినా కొనేవారు లేరని, కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. హరీశ్‌రావు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం.. నెల రోజులైనా వడ్లు కొనుగోలు చేయడం లేదన్నారు. రైతులు ఇంటికి వెళ్లకుండా వడ్ల కుప్పల దగ్గరే కాపలా కాస్తున్నారన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వెంటనే కొనుగోలు చేసి రైతుల ఇబ్బందులు తొలగించాలన్నారు. కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి, సోమిరెడ్డి, సారయ్య, రమేష్, లింగం గౌడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment