మల్లన్న ఆలయానికి కార్తీక శోభ
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయం కార్తీక శోభ సంతరించుకుంది. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. కార్తీక మాసం సందర్భంగా గంగిరేణి చెట్టు ప్రాంగణంలో దీపాలను వెలిగించారు. పట్నాలు, అభిషేకాలు, కల్యాణం మొదలగు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దేవాదాయ శాఖ ఆదేశానుసారం దీపారాధన చేసేందుకు భక్తులకు ఆలయ అధికారులు వత్తులు, ప్రమిదలు, నూనె అందించారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment