5న హ్యాండ్‌బాల్ క్రీడాకారుల ఎంపిక
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా హ్యాండ్‌బాల్ క్రీడాకారుల ఎంపిక ఈ నెల 5న హుస్నాబాద్‌లోని మినీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ సౌందర్య ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. అండర్–14, 17 బాలబాలికలకు హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహిస్తామన్నారు. రాణించిన క్రీడాకారులను ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్ (94403 39486), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ రఫత్ ఉమార్ (99595 69191)లను సంప్రదించాలన్నారు.
నేడు పత్తి కొనుగోలు
కేంద్రాలు ప్రారంభం
గజ్వేల్: నియోజకవర్గంలో సోమవారం సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, కార్యదర్శి జాన్‌వెస్లీ, వైస్ చైర్మన్ సర్దార్‌ఖాన్‌లు తెలిపారు. గజ్వేల్ పట్టణంలోని పిడిచెడ్ రోడ్డు వైపున ఈశ్వరసాయి, రామాంజనేయ, అదేవిధంగా జగదేవ్‌పూర్ మండలం గొల్లపల్లి రోడ్డువైపున శ్రీనివాస కాటన్ ఇండస్ట్రీస్ జిన్నింగ్ మిల్లుల్లో కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని పత్తి రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
ధాన్యం కొనుగోళ్లు
వేగిరం చేయండి
కొమురవెల్లి(సిద్దిపేట): గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెలరోజులు గడుస్తున్నా కొనుగోళ్లు జరగడం లేదని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు తాడూరి రవీందర్ అన్నారు. ఆదివారం అయినాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజులనుంచి రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని అన్నారు. కురుస్తున్న వర్షాలతో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇంతవరకు గన్నీ బ్యాగులు కూడా లేవని అన్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌జీటీలకే
సర్వే బాధ్యతలు సరికాదు
గజ్వేల్: ఎస్‌జీటీలకు మాత్రమే కులగణన విధులు కేటాయించడం వల్ల ప్రాథమిక విద్య బలహీన పడే ప్రమాదముందని టీపీటీఎఫ్ గజ్వేల్ జోన్ కన్వీనర్ జే.శ్రీనివాస్ అన్నారు. ఆదివారం గజ్వేల్‌లో నిర్వహించిన జోనల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌జీటీలతోపాటు ఈ సర్వేలో అన్ని రకాల ఉపాధ్యా యులను భాగస్వామ్యం చేయాలన్నారు. పాఠశాలల సమయంలో కాకుండా ఉదయాన్నే ఈ విధులను వేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్, టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ బీ.రాజులు, జిల్లా ఉపాధ్యక్షుడు పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అరుణాచల గిరి ప్రదర్శనకు ప్రత్యేక బస్సు
సంగారెడ్డి టౌన్: తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదర్శనకు సంగారెడ్డి ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్టు సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 13వ తేదీన బస్సు సంగారెడ్డి నుంచి అరుణాచలం బయలుదేరుతుందన్నారు. ఏపీలోని కాణిపాకం విఘ్నేశ్వర, వేలూరులోని మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అనంతరం అరుణాచలం చేరుకుంటుందన్నారు. ఈనెల 16వ తేదీన తిరిగి బస్సు సంగారెడ్డికి చేరుకుంటుందన్నారు. ఒక్కొక్కరికి టూర్ ప్యాకేజీ రూ. 4,300 ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 9959226267, 9849439945 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment