రుణమాఫీ చేసేవరకు పోరాటం
గజ్వేల్: రుణమాఫీ పూర్తి చేసేంతవరకు రైతుల పక్షాన పోరాడుతామని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ అధిష్టానం పిలుపుమేరకు గురువారం గజ్వేల్‌లో పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి ర్యాలీ, ధర్నా నిర్వహించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి మొదలైన ర్యాలీ ఐఓసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్) వరకు కొనసాగింది. అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యాదవరెడ్డి, ప్రతాప్‌రెడ్డిలు మాట్లాడుతూ ఆగస్టు 15లోగా 2లక్షల వరకు ఉన్న పంట రుణాలను వందశాతం మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం కేవలం 40శాతం మాత్రమే చేసిందని ఆరోపించారు. మిగిలిన 60శాతం మంది రైతులు బ్యాంకులు, వ్యవసాయాధికారుల చుట్టూ తిరుగుతూ ఆందోళన చెందుతున్నారని వాపోయారు. చిన్న, చిన్న కారణాలను సాకుగా చూపి రుణమాఫీ వర్తింపజేయకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతన లేదని అన్నారు. రైతులతో త్వరలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి, జెడ్పీటీసీలు మల్లేశం, బాలుయాదవ్, బీఆర్‌ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు నవాజ్‌మీరా పాల్గొన్నారు. ధర్నా అనంతరం ఆర్‌డీఓ బన్సీలాల్‌కు వినతిపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment