ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా వ్యాప్తంగా శనివారం భారీ ఈదురుగాలులతో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలో సగటున 23.8మి.మీ. వర్షపాతం నమోదయ్యింది. అత్యధికంగా మిరుదొడ్డిలో 70.2మి.మీ., సిద్దిపేటలో 67.8మి.మీ., చిన్నకోడూరు మండలం పెద్దకోడూరులో 62.8మి.మీ. వర్షపాతం నమోదైంది. కోహెడ మండలం శనిగరంలో 45.8మి.మీ., కోహెడ మండలం సముద్రాలలో 38.5మి.మీ., దుబ్బాక మండలం హబ్షిపూర్‌లో 33.5మి.మీ. వర్షపాతం నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. సిద్దిపేటలోని పలు కాలనీలలో చెట్లు నెలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షం
పలు ప్రాంతాల్లో కూలిన చెట్లు
మిరుదొడ్డిలో అత్యధికంగా 70.2మి.మీ.
Comments
Please login to add a commentAdd a comment