కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..
పలు పరీక్షా కేంద్రాలను కలెక్టర్ మనుచౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బయోమెట్రిక్ ప్రక్రియ పరిశీలించారు. ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తాయా? ఇతర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, అర్బన్ తహసీల్దార్ సలీమ్ తదితరులు ఉన్నారు. మరోవైపు జిల్లా పోలీసు కమిషనర్ అనూరాధ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం జవాబు పత్రాలు స్ట్రాంగ్ రూమ్ కు తరలించే ప్రక్రియపై అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, మల్లారెడ్డి, ఏసీపీ మధు, త్రీ టౌన్ సీఐ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment