సదర్ అందరి పండుగ
సిద్దిపేటజోన్: సదర్ అంటేనే అందరి పండుగ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవం నిర్వహించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డితో కలిసి హరీశ్‌రావు సదర్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగ అనేది కులాల మధ్య ఐక్యత పెంచుతుందన్నారు. కేసీఆర్ హయాంలోనే యాదవుల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం రేవంత్ పాలనలో లా అండ్ ఆర్డర్ పోయిందని, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో దీపావళి తర్వాత సదర్ పెద్ద ఎత్తున సాగుతోందన్నారు. సదర్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్ వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్లు రఘురాం, సుందర్, మోహిజ్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేటలో కనులపండువగా
సదర్ ఉత్సవం
Comments
Please login to add a commentAdd a comment