జాతీయస్థాయి పోటీలకు నవోదయ టీమ్
ఫిబ్రవరి 4, 5న పోటీలు
వర్గల్(గజ్వేల్): జాతీయస్థాయి యూత్ పార్లమెంట్ పోటీలకు సిద్దిపేట జిల్లా వర్గల్ నవోదయ టీమ్ ఎంపికై ంది. సెప్టెంబర్ 12న వర్గల్ నవోదయ వేదికగా ఎంపీ రఘునందన్‌రావు సమక్షంలో జరిగిన రీజియన్ స్థాయి పోటీల్లో స్థానిక నవోదయ యూత్‌పార్లమెంట్ టీమ్‌లో పార్లమెంట్ స్పీకర్‌గా వైష్ణవి, ప్రధానిగా ఆదినాథ్, ప్రతిపక్ష నాయకునిగా అభినవ్‌తో కలిపి మొత్తం 55మంది విద్యార్థులు వివిధ పాత్రలు పోషించారు. మాక్ పార్లమెంట్ సెషన్ ఆవిష్కరిస్తూ రైతు ఆత్మహత్యలు, వాయనాడ్‌లో ప్రకృతి ప్రకోపం, ఎం వైరస్ నివారణ, ఆర్థిక ప్రగతి, నవోదయ లక్ష్యాలు, పెన్షన్ విధానం తదితర అనేక అంశాలను చర్చించారు. క్వశ్చన్ అవర్, బిల్లుల తీర్మానం, ఆమోదం చేస్తూ ఆకట్టుకున్నారు. ఈ పోటీలో చక్కని ప్రతిభతో రీజియన్‌స్థాయి నుంచి వర్గల్ నవోదయ టీమ్ జాతీయస్థాయి పోటీలో పాల్గొనే అర్హత సాధించిందని విద్యాలయ ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ వెల్లడించారు. జాతీయ స్థాయి పోటీలు ఫిబ్రవరి 4,5 తేదీలలో నాగపూర్, పుణె రీజియన్లలో జరుగుతాయని తెలిపారు. జాతీయస్థాయికి తమ టీమ్ ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment