స్వచ్ఛతలో ఆదర్శంగా నిలబెట్టాలి
గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని స్వచ్ఛ తలో ఆదర్శంగా నిలబెట్టడానికి అంతా సహకరించాలని మున్సిపల్ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి కోరారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని పిడిచెడ్ రోడ్డు వైపున ఉన్న డంపింగ్ యార్డును సందర్శించా రు. ఈ సందర్భంగా తడి, పొడి చెత్తను వేరు చేసే విధానాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్య లోపాన్ని నివారించడానికి సంబంధి త అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాల న్నారు. యూజీడీకి చెందిన ఎస్‌టీపీ(సేవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్)ను సైతం సందర్శించి నిర్వహ ణ తీరును పరిశీలించారు. మున్సిపల్ ఏఈ మహేశ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్మన్ రాజమౌళి
Comments
Please login to add a commentAdd a comment