సగం మంది గైర్హాజరు
గ్రూపు–2 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలో టీజీపీఎస్సీ గ్రూప్–2 పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. రెండో రోజు కూడా గ్రూప్– 2 పరీక్షకు సగం మందే హాజరయ్యారు. మూడవ పేపర్‌కు 13,717మందికిగాను 6,869మంది హాజరుకాగా 6,848 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన నాల్గవ పేపర్‌కు 6,899 మంది హాజరయ్యారు. 6,818 మంది వివిధ కారణాలతో గైర్హాజరయ్యారు. మొత్తంగా రెండు పేపర్లకు సగం మంది మాత్రమే హాజరు కావడం విశేషం. పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. ఒక్క నిమిషం నిబంధనలు పక్కాగా అమలు చేశారు. ఆయా కేంద్రాల్లో 10 మంది నిర్ణీత సమయం దాటిన తర్వాత రావడంతో నిబంధనల మేరకు వారిని వెనక్కి పంపించారు. నారాయణ, మాడ్యులస్, శ్రీవాణితోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్ మను చౌదరి తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment