విద్యార్థులకు నాణ్యమైన భోజనం
మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి
రామాయంపేట(మెదక్): విద్యార్థుల శ్రేయస్సుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి పేర్కొన్నారు. మండలంలోని ప్రగతి ధర్మారం గ్రామంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో కలసి ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... స్కూళ్లలో నేడు నాణ్యమైన భోజనం వండి వడ్డిస్తున్నారని, విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. కాస్మెటిక్, మెస్ చార్జీలను పెంచిన ప్రభుత్వం విద్యార్థులకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు విద్యార్థులతో కలసి భోజనం చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు, పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు యుగంధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment