స్వచ్ఛతలో మెరుగైన ఫలితాలు
హుస్నాబాద్‌లో 20 వార్డులు, 7,533 ఇళ్లు, 30,353 జనాభా ఉంది. ప్రతిరోజు ఇళ్ల నుంచి 9.5 మెట్రిక్ టన్నుల చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. తడిచెత్తతో సేంద్రియ ఎరువును తయారుచేసి మొక్కలకు వాడుతున్నారు. అలాగే తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్తను వేరుచేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా ప్రజలు నేరుగా తడి చెత్త నుంచి ఎరువు తయారు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ప్లాస్టిక్ వసువులను వాడకుండా బట్ట సంచులను వినియోగించుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తూ మున్సిపాలిటీ ఆదర్శంగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment