నత్తనడకన బ్రిడ్జి పనులు
నంగునూరు(సిద్దిపేట): నంగునూరు మండల ప్రజలు కరీంనగర్‌కు, అక్కడి వారు హన్మకొండకు వెళ్లేందుకు మల్లారం నుంచి సికింద్లాపూర్, దర్గపల్లి, బద్దిపడగ మీదుగా ప్రయాణిస్తారు. వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకొని హైలెవల్ బ్రిడ్జి, రెండు పక్కల రోడ్డు నిర్మాణం కోసం రూ 7.15 కోట్లు మంజూరుకు కృషి చేసిన అప్పటి మంత్రి హరీశ్‌రావు 31 మార్చి 2022లో శంకుస్థాపన చేశారు. చిన్నకోడూరు మండలం మాచాపూర్ నుంచి నంగునూరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. దర్గపల్లి నుంచి సికింద్లాపూర్ వెళ్లే దారిలో వాగు ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించిపోయేవి. అలాగే గతంలో నిర్మించిన బ్రిడ్జి తక్కువ ఎత్తులో ఉండడంతో వాహన దారులు ప్రవాహ వేగాన్ని గుర్తించకపోవడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు ప్రమాదాల బారిన పడ్డారు.
రాకపోకలు బంద్
బ్రిడ్జి పక్క నుంచి వేసిన మట్టి రోడ్డు తరచూ నీట మునుగుతోంది. రాకపోకలు స్తంభించి పోతున్నాయి. ప్రమాదాల నివారణ కోసం తరచుగా ఈ మార్గాన్ని మూసి వేయాల్సి వస్తోంది. దీంతో వాగు వరకు వచ్చి తిరిగి వెనక్కి పోతున్నారు. ఆ మేరకు దూరాభారం పెరుగుతోందని వాహన దారులు వాపోతున్నారు. బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టిన కాంట్రాక్టర్ రెండు సంవత్సరాలు అవుతున్నా పనులు పూర్తి చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇప్పటికై నా స్పందించి బ్రిడ్జి నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
వాహనదారులకు ఇబ్బందులు
వేరే మార్గాల్లో ప్రయాణం
దూరాభారానికి కారణం
వాగు ఉధృతంగా ప్రవహిస్తే
రాకపోకలు బంద్
వంతెన పనులు రెండేళ్లుగా నత్తనడకన కొనసాగుతున్నాయి. దీంతో నంగునూరు, చిన్నకోడూరు మండలాల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకల కోసం బ్రిడ్జి పక్క నుంచి మట్టి రోడ్డు వేస్తే గుంతలమయంగా మారింది. వర్షం కురిస్తే వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కరీంనగర్ వైపు ప్రయాణించే వాహనాలు ఇతర మార్గాల గుండా వెళ్తుండగా దూరాభారం పెరుగుతోంది.
పనులు పూర్తి చేసేలా చర్యలు
బ్రిడ్జి నిర్మాణం పనులు ఆగిపోవడంతో పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించాం. త్వరగా పనులు ప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.
– శ్రీకాంత్, ఆర్‌అండ్‌బీ ఏఈఈ
Comments
Please login to add a commentAdd a comment