తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌గా మీ ముందుకు
సిద్దిపేటకమాన్: ఏపీజీవీ బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా పేరు మార్పు చేసుకుని జనవరి 1, 2025 నుంచి ఖాతాదారులకు అందుబాటులోకి రానున్నట్లు రీజినల్ మేనేజర్ (ఆర్‌ఎం) ఆర్.ఉదయ్ కిరణ్ తెలిపారు. సిద్దిపేటలోని ఏపీజీవీబీ రీజినల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకు పేరు మారుతున్న దృష్ట్యా న్యూ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అవుతున్న నేపథ్యంలో ఈ నెల 28 నుంచి 31 వరకు బ్యాంకు ఆన్‌లైన్ సేవల్లో అంతరాయం ఏర్పడుతున్నట్లు తెలిపారు. ఖాతాదారులు గమనించాలని సూచించారు. జనవరి 1 తర్వాత ఖాతాదారులకు నూతన ఏటీఎం కార్డులు జారీ కానున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ సేవల కోసం బ్యాంకు వారు జారీ చేసే క్యూర్ కోడ్‌ను స్కాన్ చేసుకోవాలని సూచించారు. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో 51 బ్రాంచ్‌లున్నాయని, వీటిలో 4.80లక్షల మంది ఖాతాదారులు ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆపరేషన్ మేనేజర్ జీ.సతీశ్, బిజినెస్ మేనేజర్ రజాక్‌పాషా, సిబ్బంది రాజేశ్, ధర్మరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌ఎం ఉదయ్ కిరణ్
Comments
Please login to add a commentAdd a comment