గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోండి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): గ్రంథాలయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి అన్నారు. ఆదివారం పట్టణ గ్రంథాలయాన్ని సందర్శించారు. ముందుగా అక్కడి పాఠకుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆవరణలో ఉన్న చెత్తను, తొలగించాలని మున్సిపల్ కార్మికులను ఆదేశించారు. లింగమూర్తి మాట్లాడు తూ గ్రంథాలయాలలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని పాఠకులు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ దాసరిరాజు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజల కష్ట సుఖాల్లో
అండగా ఉంటా
ఎంపీ రఘునందన్‌రావు
దుబ్బాక: ప్రజల కష్ట సుఖాల్లో ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం రాత్రి దుబ్బాక పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడు మర్గల సత్యానందంను పరామర్శించి ఆయన ఆరోగ్యపరిస్థితిని తెలుసుకున్నా రు. అనంతరం బీజేపీ రాష్ట్ర నాయకుడు అంబటి బాలేష్‌గౌడ్, చేర్వాపూర్‌లో మూర్తి రాజేందర్‌రెడ్డిల నూతన గృహప్రవేశాల వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజలకు ఏ ఆపద వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment