విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపండి
● వచ్చే మూడు నెలలు కీలకం ● టెన్త్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి ● తల్లిదండ్రులకు ఎమ్మెల్యే హరీశ్‌రావు ఉత్తరాలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రానున్న మూడు నెలలు టెన్త్ విద్యార్థులకు కీలకమని, ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు సోమవారం ఉత్తరాలు రాశారు. ఈ ఉత్తరంలో ఏం ఉందంటే.. మార్చి నెలలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల నిమిత్తం పిల్లలను ప్రత్యేక శ్రద్ధ చూపి చదివించాలాన్నారు. ప్రణాళికాబద్ధమైన చదువు మన తలరాతనే మారుస్తుందనడానికి ఎన్నో సజీవసాక్ష్యాలు ఉన్నాయని ఉత్తరంలో పేర్కొన్నారు. వారి చదువులో ఇది అత్యంత కీలకమైన ఘట్టమన్నారు. ఇది మంచి మార్కులతో గట్టెక్కితేనే ఉన్నత చదువుల దిశగా ముందడుగు వేసే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచండన్నారు. నాలుగేళ్లుగా మన సిద్దిపేట నియోజకవర్గంలో చదివిన పదో తరగతి విద్యార్థులంతా అత్యధిక మార్కులు సాధిస్తున్నారన్నారు. నూటికి నూరు శాతం పాసవుతున్నారు. ప్రతిష్టాత్మకమైన బాసర ట్రిపుల్ ఐటీ విద్యాసంస్థలోనూ 169 మంది సిద్దిపేట నియోజకవర్గ విద్యార్థులు గత ఏడాది సీట్లు సాధించడం గర్వకారణమన్నారు. అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచిన మన సిద్దిపేట నియోజకవర్గం.. పదో తరగతి ఫలితాల్లో కూడా ఆదర్శంగా నిలవాలనేదే నా తాపత్రయమన్నారు. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని ఉత్తరంలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment