త్వరలో మెడికల్ కళాశాల
హుస్నాబాద్: పట్టణంలో త్వరలోనే మెడికల్ కళాశాల ఏర్పాటు ఖాయమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో స్ఫూర్తి అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ మంత్రి పొన్నం నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. ఏడాది కాలంలోనే రూ.1000 కోట్ల నిధులను మంజూరు చేయించారని, త్వరలోనే మెడికల్ కళాశాలను తీసుకువస్తారని తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ రజిత మాట్లాడుతూ హుస్నాబాద్ మున్సిపాలిటీకి వరుసగా నాలుగు సార్లు కేంద్ర ప్రభుత్వ అవార్డులు రావడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో స్ఫూర్తి అసోసియేషన్ అధ్యక్షుడు పందిల్ల శంకర్, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
కేడం లింగమూర్తి
Comments
Please login to add a commentAdd a comment