నయా కిక్కు!
‘ఫుల్లు’గా తాగేశారు
సాక్షి, సిద్దిపేట: నూతన సంవత్సరం ఎకై ్సజ్ శాఖకు భారీ ఆదాయం సమకూరింది. మంగళవారం ఒక్క రోజే రూ.10.57 కోట్ల మద్యం తాగేశారు. డిసెంబర్ 27 నుంచి 31 వరకు ఐదు రోజుల్లో రూ. 40.53కోట్లు విక్రయాలు జరిగాయి. జిల్లాలో 93 వైన్ షాప్‌లు, 16 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. 2023 డిసెంబర్ 27 నుంచి 31 వరకు రూ32.91కోట్లు విక్రయించగా, 2024 డిసెంబర్ 27 నుంచి 31వ తేదీ వరకు రూ40.53కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ సారి రూ.7.61కోట్ల విక్రయాలు పెరిగాయి. బీర్ల కంటే ఐఎంఎల్ మద్యమే ఎక్కువగా సేవించారు. నూతన సంవత్సరం రోజూ కూడా మద్యం ప్రియులు వైన్ షాపుల ఎదుట బారులు తీరారు.
‘జీరో యాక్సిడెంట్ నైట్’గా..
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బందోబస్తు, విధించిన ఆంక్షలు ఫలితాలనిచ్చాయి. నూతన సంవత్సర స్వాగత వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జరిగాయి. మొత్తంగా ఒక్క రోడ్డు ప్రమాదం కూడా నమోదు కాకుండా జీరో యాక్సిడెంట్ నైట్‌గా చేయడంలో పోలీసులు సఫలీకృతులయ్యారు. డిసెంబర్ 31న రాత్రి పోలీసుల ఆంక్షలు ముందస్తుగానే ప్రకటించి, హెచ్చరికలు జారీ చేశారు.. దీంతో పాటు ‘సాక్షి’ ఆధ్వర్యంలో సీపీ అనురాధతో ఏర్పాటు చేసిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో నిబంధనలపై ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానలిచ్చారు. ఇలా’ సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా సైతం ప్రజల్లో అవగాహన కల్పించినట్లయింది. కమిషనరేట్ పరిధిలో పోలీసులు నిరంతరం ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించారు. వేడుకలు జరుపుకొనే వారు కాలనీలు, ఇళ్లకే పరితమై ఇతరులకు ఇబ్బందులు కలగజేయకుండా చర్యలు తీసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో మద్యం తాగి వాహనాలు నడపడం, మితిమీరిన వేగం, పరిమితికి మించి వాహనాలపై ప్రయాణించడం తదితర ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలో 89 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు.
నాన్‌వెజ్‌కు డిమాండ్
మద్యం తాగేవాళ్ల కంటే మాంసం ముక్కను తినేవాళ్లు ఎక్కువగా ఉంటారు. డిసెంబర్ 31 మంగళవారం, జనవరి 1 బుధవారం కావడంతో చికెన్, మటన్, చేపల షాపులు ఉదయం నుంచే కిటకిటలాడాయి. సాధారణ రోజులతో పోలిస్తే ఈ రెండు రోజులు విక్రయాలు పెరిగాయి. పలు హోటళ్లలో ప్రత్యేక కౌంటర్‌లు ఏర్పాటు చేశారు. అలాగే రాత్రి సమయంలో ఆయా హోటళ్లు, జోమాటో, స్విగ్గీ సంస్థలు డోర్‌డెలివరీలు సైతం అందించారు. పెద్దలందరూ మద్యం, మాంసాలతో ఎంజాయ్ చేస్తే.. నూతన సంవత్సరం స్వాగతం పలికేందుకు చిన్నారులు పెద్దలు కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఒక్కరోజే రూ.10.57 కోట్ల మద్యం
అమ్మకాలు
ఐదు రోజుల్లో
రూ.40.53కోట్ల విక్రయాలు
నాన్‌వెజ్‌కు భలే గిరాకీ
‘సాక్షి’ అవగాహన.. పోలీసుల
హెచ్చరికలతో జీరో యాక్సిడెంట్
కొత్త సంవత్సర వేడుకలు ఏమో కానీ.. మద్యం వ్యాపారం మాత్రం జోరుగా సాగింది. ఏకంగా ఒక్క రోజే రూ.10.57 కోట్ల మద్యం అమ్మకాలు జరగడం గమనార్హం. ఐదు రోజుల్లో రూ.40.53కోట్ల మద్యం అమ్ముడు పోయింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరిట మందుబాబులు ‘ఫుల్లు’గా లాగించేశారు. వేలాది సీసాలను ఖాళీ చేసి పడేశారు. ఓవైపు యువత మత్తులో జోగితే, మరోవైపు సర్కారుకు దండిగా ఆదాయం సమకూరింది. సీపీతో ‘సాక్షి’ ఫోన్‌ఇన్.. పోలీసుల ముందస్తు హెచ్చరికలు మంచి ఫలితాలిచ్చాయి. డిసెంబర్ 31 రాత్రి జీరో యాక్సిడెంట్‌తో సంబరాలు జరగడం శుభశూచకం.
Comments
Please login to add a commentAdd a comment