పోటీతత్వంతో ఆడితేనే విజయం సొంతం
బెజ్జంకి(సిద్దిపేట): క్రీడాకారులు పోటీతత్వంతోనే ఆడితేనే విజయాలు సాధించగలరని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెజ్జంకిలో నిర్వహిస్తున్న 47వ జిల్లాస్థాయి ఎమ్మెల్యే క్రికెట్ టోర్నమెంట్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక దారుఢ్యం, స్నేహ సంబంధాలు పెరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్లీ బ్లాక్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, పార్టీ మండల అధ్యక్షుడు రత్నాకర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పులికృష్ణ, వైస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, పోచయ్య, ప్రభాకర్, శరత్, సందీప్, చేప్యాల శ్రీనివాస్, మల్లికార్జున్, శ్రీకాంత్, సంతోష్, జాంగీర్, క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి
Comments
Please login to add a commentAdd a comment