అర్జీలకు సత్వర పరిష్కారం
● కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ● ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు 49
సిద్దిపేటరూరల్: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించే దిశగా కృషి చేయాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో ఆశతో కలెక్టరేట్‌కు వస్తున్న క్రమంలో వారి సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 49 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్‌ఓ నాగరాజమ్మ, డీఆర్‌డీఓ జయదేవ్ ఆర్యా, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ అభినందనలు
జాతీయ సైన్స్ ఫెయిర్‌కు ఎంపికై న మర్కూక్ మండలం దామరకుంటకు చెందిన విద్యార్థులు అశ్వంత్, కార్తిక్‌చారిలను కలెక్టర్ అభినందించారు. జాతీయ స్థాయిలో ప్రదర్శించే ప్రాజెక్టుల గురించి అడిగి తెలుసుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లో జరిగే సైన్స్ కాంగ్రెస్‌లో వీరు పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment