అంగరంగ వైభవం.మూలమహోత్సవం
● లక్షపుష్పార్చన నేత్రపర్వం ● భక్తి పారవశ్యంలో వర్గల్ క్షేత్రం
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధ వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రం మూల మహోత్సవ వేడుకలతో అలరారింది. సోమవారం సరస్వతిమాత జన్మ నక్షత్రం సందర్భంగా సామూహిక లక్షపుష్పార్చన నేత్రపర్వం చేసింది. తెల్లవారుజామున ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర సిద్ధాంతి ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారి మూలవిరాట్టుకు విశేష పంచామృతాభిషేకం జరిపారు. పట్టువస్త్రాలు, ఆభరణాలు, పూల మాలలతో కమనీయంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు చేశారు. మహాకలశ మండపంలో భక్తజనులు అమ్మవారి నామం స్మరిస్తూ సామూహిక లక్షపుష్పార్చన జరిపారు. వేదపండితులు యాగశాలలో చండీ హోమం, పూర్ణాహుతి నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment