అర్చకుల సమస్యలు పరిష్కరించాలి
కొమురవెల్లి(సిద్దిపేట): అర్చకుల సమస్యలు పరిష్కరించాలని అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేందర్ శర్మ అన్నారు. మంగళవారం కొమురవెల్లి మల్లన్న ఆలయ ఈవో బాలాజీ పదవీ విరమణ సందర్భంగా అర్చకులతో కలసి ఆశీర్వచనం అందించి శాలువాతో సన్మానించారు. అనంతరం ఆయన మట్లాడుతూ పదవీ విరమణ ప్రతీ ఉద్యోగికి సహజమని, దేవాలయాల అభివృద్ధికి మంత్రి కొండా సురేఖ చొరవ చూపడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్చకుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ధూప దీప నైవేద్యం స్కీంను రద్దు చేసి అందులో పని చేస్తున్న అర్చకులను దేవాదాయ ధర్మాదాయశాఖ నుంచి వేతనాలు చెల్లించి ఉద్యోగులగా గుర్తించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అర్చక సంఘం అధ్యక్షుడు కలకుంట్ల వెంకట నర్సింహచార్యలు, మతైక సంఘం అధ్యక్షుడు కృష్ణమాచార్యలు, రాష్ట్ర కార్యదర్శి, ఆలయ ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్, స్థానచారి మల్లయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు.
ఆలయ ఈఓగా రామాంజనేయులు
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఈఓగా కె.రామాంజనేయులును నిమమిస్తూ దేవాదాయశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈఓగా విధులు నిర్వహిస్తున్న బాలాజీ పదవీ విరమణ పొందడంతో అతని స్థానంలో హైదరబాద్‌లోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో గెజిటెడ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న రామాంజనేయలును నియమించారు.
అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు
గంగు ఉపేందర్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment